సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో పాల్గొన్నారు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఉత్సవం సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఆయన ఆలయానికి చేరుకొని నిర్వహణను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని అభినందించారు.