సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్బంధాల మధ్య జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రంగం కార్యక్రమం ముగిశాక ఆయన ఆలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. నిన్న ఉదయం 3 గంటలకు తెరవాల్సిన ఆలయం 4: 10 నిమిషాలకు తెరవడంపై తప్పుబట్టారు. 4:10 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అని ఎవరు చెప్పారు? అంటూ ప్రశ్నించారు.