సనత్ నగర్: ప్రత్యేక పూజలకు రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి కోటి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ ఈవో శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు తలసానిని ఆశీర్వదించి ఆహ్వానం పత్రికను అందజేశారు. తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే తలసాని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్