వార్డు మెంబర్ గా కూడా గెలవని కొందరు కేటీఆర్ ను విమర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్ఎస్ భవన్ లో అయన మాట్లాడుతూ. రేవంత్ సవాలును కేటీఆర్ స్వీకరించి 72 గంటల సమయం కూడా ఇచ్చారు. అయిన చర్చకు రాకుండా రేవంత్ పారిపోయారన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే కేటీఆర్, కేసీఆర్ పై అసభ్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.