హైదరాబాద్‌లోని శామీర్‌పేట్ తహసీల్దార్ ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తహసీల్దార్ సుచరిత రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. అవినీతికి పాల్పడిన తహసీల్దార్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.