ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం సికింద్రాబాద్ జోన్ గౌరవ అధ్యక్షుడిగా సాదం బాలరాజ్ యాదవ్, రాణిగంజ్ డిపో గౌరవ అధ్యక్షుడిగా కోటేశ్వర్ గౌడ్ ఎన్నికైన నేపథ్యంలో వారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే తలసాని వారిని అభినందించి, వారి భవిష్యత్ బాధ్యతలలో విజయవంతం కావాలంటూ ఆశీర్వదించారు. నేతలు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.