అభివృద్ధి పనులను పరిశీలించిన కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలు

సికింద్రాబాద్ పికెట్ గార్డెన్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై హెల్త్ సూపరిండెంట్ దేవేందర్, సానిటరీ సూపరిండెంట్ మహేందర్తో చర్చించి అవసరమైన వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్, పార్కుకు వచ్చే సీనియర్ సిటిజన్లకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్