దాదాపు పదేళ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు రావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ అధ్వర్యంలో లబ్దిదారులకు మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గతంలో ఏ పథకానికి అప్లై చేయాలన్నా తెల్ల రేషన్ కార్డు అడిగేవారు. ఇప్పుడు మా బాధలు తీరిపోయాయని లబ్ధిదారులు పేర్కొన్నారు.