పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన గద్దర్ కుమార్తె వెన్నెల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రంగా స్పందించారు. తెలంగాణ గడ్డ తమ జాగీరని, త్యాగాలతో సాధించుకున్న ఉద్యమం ఇదని ఆమె గుర్తు చేశారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్‌ను అభిమానిస్తారని చెబుతూనే, పైసలు పంచితేనో, లాబీయింగ్ చేస్తేనో తెలంగాణ రాలేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్