తీవ్ర ఎండల ప్రభావం: కోడిగుడ్డు ధరలు ఆకాశానికి

తెలంగాణలో కోడిగుడ్డు ధరలు గణనీయంగా పెరిగాయి. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో, స్థానిక మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో సగం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటం, దాణా, రవాణా ఖర్చులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రైతుకు దాదాపు 7 రూపాయలు ఖర్చవుతుండగా, మార్కెట్లో ధర 8 రూపాయలు దాటింది.

సంబంధిత పోస్ట్