6 వార్డు సీతారాంపురంలోని వీరాంజనేయ శివపంచాయతన ఆలయ 23వ వార్షికోత్సవం శుక్ర, శనివారాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా నిర్వహించిన అంకురార్పణ, అకండ దీపారాధన, గణపతి పూజ, ఆరాధన, రుద్రహోమం, శాంతికళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, అన్నదానం, తదితర పూజ కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.