దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశాపోగు జాను ఆదేశాల మేరకు, దళిత జర్నలిస్టుల మహాసభలకు సంబంధించిన మెమొంటోస్ ను, ప్రధానం చేశారు. సోమవారం నాడు తన కార్యాలయంలో కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, మెమొంటోస్ ను అందజేయడం జరిగిందని, దళిత జర్నలిస్టు ఫోరం గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల ఎల్లేష్ తెలిపారు.
దళిత జర్నలిస్టుల సమస్యలపై వివిధ అంశాల గురించి మల్లెపల్లి లక్ష్మయ్యతో మాట్లాడడం జరిగిందని దొమ్మాటి శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు దొమ్మాటి శివకుమార్, కార్యవర్గ సభ్యులు మహా రాయుడు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.