సరస్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిశారు. సరస్వతి నగర్లో ఉన్న సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ, వాటర్ లైన్ సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని కోరారు. తప్పకుండా తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ సీఈఓతో మాట్లాడి దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.