వార్డు 2 రసూల్ పురలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎండల తీవ్రత నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరి బుధవారం వార్డు 2 రసూల్ పురలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. ఎండ తీవ్రతలో ప్రజలకు చల్లని మంచినీరు అందించే ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని, సేవా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ముందుండి ప్రజలకు అండగా నిలవడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. ప్రజా సేవే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్