కంటోన్మెంట్ వార్డు 1, బోయిన్ పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ ఏర్పాటు చేసిన వాటర్ క్యాంప్ ను బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్, జంపన ప్రతాప్ ప్రారంభించారు. మండు వేసవిలో వాటర్ క్యాంప్ లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన చల్లని నీరు అందిస్తూ ప్రజల దాహం తీరుస్తున్న నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. మరింత మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.