డబల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

కంటోన్మెంట్ 2వ వార్డు, రసూల్ పురలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మార్వో, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించినా కూడా పనులు ఆలస్యమవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్