తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు శనివారం జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా కె సాగర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా సంతోష్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తోట సుధీర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రదీప్ వర్మ, బాలకృష్ణ, కార్యదర్శులుగా రాహుల్, క్రిష్ణారెడ్డి, సభ్యులుగా వాజీద్ అలీ, లింగం, నవీన్ కుమార్ ఎన్నికయ్యారు.