సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న బోనాల ఉత్సవాల సందర్భంగా పోలీసులు ఈనెల 13, 14 తేదీలలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆలయ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గం లోనే వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహన దారులందరూ తమతో సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.