ఉద్యోగ మేళాలో 20 కంపెనీలు పాల్గొన్నాయి.. ఓయూ వీసీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్‌సిడిసి) విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఓయూ సిఎఫ్‌ఆర్‌డి బిల్డింగ్‌లో జరిగిన ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సిడిసి ద్వారా క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. వీసీ ప్రొఫెసర్ కుమార్, హెచ్‌సిడిసి డైరెక్టర్ విజయచరణ్, వారి బృందాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్