సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు అమ్మవారి ముఖం ద్వారా పోతరాజు వేషం, పొట్టేలు, తొట్టెల్లో, పలారం బండి రూపం ఆకట్టుకుంటుంది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో బార్కెట్లతో క్యూలైన్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రధాన ఘట్టం బోనాల సమర్పణ, అనంతరం ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం రంగం, భవిష్యవాణి, అమ్మవారి గజరాజు అంబారి ఊరేగింపు జరుగుతుందన్నారు.