బీసీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ హక్కుల కోసం ప్రాణం పోయినా సరే పోరాడుతానని, ఈ నెల 9వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన ప్రకటించారు. బీసీల సమస్యలపై బీజేపీ బీసీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన వీహెచ్, తాజాగా జరుగుతున్న జనగణనలో బీసీల ప్రస్తావనే లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.