హైదరాబాద్‌లోని NTR మార్గ్‌లో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేస్తుండగా ఓ బైకర్ ఆగకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఆపలేకపోయిన ఒక పోలీస్ కానిస్టేబుల్, వెనుక కూర్చున్న యువతి చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.