ట్రాఫిక్ అదనపు డీసీపీ ఎస్. రంగారావు పదవీ విరమణ బుధవారం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, రంగారావు అందించిన సేవలను కొనియాడారు. వారి శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ పోలీస్ కుటుంబంలో సభ్యులేనని అన్నారు.