సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని నిత్యావసరాల గోదాంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊరట చెందారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.