హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఆదివారం పార్క్ చేసిన ఎలక్ట్రిక్ కారులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా డ్రైవర్లు అప్రమత్తమై కార్లను తరలించారు. ఈ ఘటనలో ఒక కారు పూర్తిగా, మరో కారు పాక్షికంగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనపై విచారణ చేపట్టారు.