త్వరలోనే ఉత్తర తెలంగాణ వాసులకు విమాన సౌకర్యం.. కేంద్రమంత్రి

రాబోయే మూడు నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం  ప్రకటించారు. అదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిని రక్షణ శాఖ చేపట్టనుంది. పౌర విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను ఏఏఐ నిర్మించనుంది. ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వేతో మాస్టర్ ప్లాన్ ఖరారు కానుంది. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించాల్సి ఉంది. త్వరలోనే ఉత్తర తెలంగాణ వాసులకు విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్