మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలోని విష్ణుపురి కాలనీ హ్యాపీ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మహా గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా పిల్లల కోసం ఆటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి పాల్గొని, ఆటలలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవాలు పిల్లలలో ఉత్సాహాన్ని నింపాయి.