సికింద్రాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

రేపటి నుంచి వైద్యవృత్తిలో అడుగుపెట్టనున్న ఎంబీబీఎస్ డిగ్రీ పట్టాలు తీసుకున్న వారంతా నిబద్ధతతో పనిచేస్తూ వైద్య వృత్తికి గుర్తింపు తేవాలని కాలోజి నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డా. నందకుమార్ రెడ్డి, డీఎంఈ డా. నరేంద్ర కుమార్ అన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులైన 2019 బ్యాచ్ కు చెందిన 245 మందికి శుక్రవారం డిగ్రీ పట్టాలను అందజేశారు. ప్రిన్సిపల్ డా. ఇందిరా, ఎమ్మెల్యే అనిల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్