హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కాకముందే, గ్రామాల బాట పట్టే జనంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. శనివారం సాయంత్రం బేగంపేట్ నుండి సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు వరకు ట్రాఫిక్ స్తంభించిపోయి, వాహనాలు కిలోమీటర్ల మేర నత్తనడకన సాగాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వేల మంది ప్రజలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలోని తమ స్వగ్రామాలకు వెళ్లనున్న నేపథ్యంలో, నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. బేగంపేట్–సికింద్రాబాద్ మార్గంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్