మీర్పేట్: బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని లెనిన్ నగర్ వద్ద ఉన్న టేస్టీ ఫుడ్ కోర్ట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఫుడ్ సెంటర్ లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో షాపు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.