కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన విమర్శలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, భవిష్యత్తులో అవి కలిసిపోతాయని జోస్యం చెప్పారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలుంటే చర్చకు సిద్ధమని, హరీశ్‌రావు వద్ద ఆధారాలుంటే తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు.