హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో అలియా ఐస్‌క్రీమ్ పార్లర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా హానికర రసాయనాలతో, అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఐస్‌క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న యజమాని సయ్యద్ ముషరఫ్‌ఉద్దీన్‌ను అరెస్ట్ చేశారు. సుమారు రూ.5.44 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.