కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, రెస్టారెంట్లు, పబ్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు సురక్షితంగా, ఆనందంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల నిర్వహణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.