సిట్ అధికారుల తీరుపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ రాస్తూ, సెక్షన్ 160 ప్రకారం తాను జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో లేనని, తనకు నోటీసులు ఇచ్చే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లోని చిరునామాతో సంబంధం లేదని, నోటీసు ఇచ్చే సమయంలో వాస్తవ నివాసమే ప్రాముఖ్యమని, ప్రస్తుతం తన నివాసం ఎర్రవల్లి అని లేఖలో పేర్కొన్నారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం తన గౌరవానికి భంగం కలిగించడమేనని, దీనికి సంబంధించిన పలు కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. హరీష్‌రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అడ్రస్ ఉన్నా హైదరాబాద్‌లో నోటీసులు ఇవ్వడం పోలీసుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేసీఆర్ అన్నారు.