సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్దగల ఒక కళ్ల అద్దాల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను సకాలంలో అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్