సికింద్రాబాద్ జీఆర్సీ పోలీసులు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా చౌడంగాపూర్ ప్రాంతం వాసి బెంజమిన్ గమాంగో(31) వ్యవసాయ కార్మికుడు. విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లో జనరల్ కోచ్ లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించగా బ్యాగులో గంజాయిని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి మంగళవారం 4. 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.