చేపల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి భవానీనగర్‌లో చేపల వ్యాపారి పూస స్వామి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబంతో కలిసి సోమవారం గజ్వేల్‌కు వెళ్లి బుధవారం ఉదయం తిరిగి వచ్చిన ఆయన ఇంట్లో తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. దుండగులు ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదు, 5.5 తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్