బౌద్ధనగర్ లో పర్యటించిన మేయర్, ఎంపీ

జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత కలిసి శుక్రవారం బౌద్ధనగర్ లో పర్యటించారు. అంబర్నగర్ నాలా ప్రాజెక్టుపై కార్పొరేటర్ కంది శైలజ చేసిన ప్రతిపాదన నేపథ్యంలో మేయర్ నాలాను సందర్శించారు. శానిటేషన్ పనులు, స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆదం సంతోష్ కుమార్, కంది నారాయణ, శ్రీకాంత్ రాజేశ్, ఖలీల్ బాబా, క్రాంతి, మానస, మంజు, భాగ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్