ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం - స్మితా కోటేశ్ గౌడ్

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని బిఆర్ఎస్ పార్టీ మహిళ సీనియర్ నాయకురాలు మురారి స్మితా కోటేశ్ గౌడ్ తెలిపారు. మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ళ పద్మారావు గౌడ్‌ ఆదేశాల మేరకు సోమవారం తార్నాక ప్రాంతంలో దాదాపు ఏడాది కాలంగా పనిచేయని వీధి దీపాలపై స్థానిక నివాసితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమె పర్యటించారు. అనంతరం సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సహకారంతో పనిచేయని వీధి దీపాలకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕