హైదరాబాద్‌లో నిషేధిత ఇంజక్షన్లు స్వాధీనం

హైదరాబాద్‌ నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన 423 ఇంజక్షన్లను పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని విక్రయిస్తున్న నిందితులు మహ్మద్‌ జుబైర్‌, వినయ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకి తరలించారు. వారి నుంచి రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు, రూ.9,430 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్