సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం ఈనెల 17న నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ తెలిపారు. సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో ఉదయం 11 గంటలను నిర్వహించే సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు హాజరు కావాలని బుధవారం కోరారు. బీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం చేయడానికి చేపట్టవలసిన చర్యలను చర్చించనున్నారు.