ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవడంతో సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఆ పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు చేసుకున్నాయి. రామోపాల్పేట్ డివిజన్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు మిఠాయి తినిపించుకుంటు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సందీప్ వర్మ, ఎస్ఆర్ మల్లేశ్, ప్రతాప్, సునీల్, అవినాశ్ పాల్గొన్నారు.