కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బన్సీలాల్పేట్ జబ్బార్ కాంప్లెక్స్ సమీపంలో పెంచిన గ్యాస్ ధరలపై నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా జిల్లా సెంట్రల్ సిటీ ఉపాధ్యక్షురాలు శారదా మాట్లాడుతూ. మోది ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు వరాలిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు విజయలక్ష్మీ, హేమలత, స్వరూప పాల్గొన్నారు.