సికింద్రాబాద్ మహంకాళి హుండీ ఆదాయం రూ. 12, 58, 724

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో గుత్త మనోహర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సూరిటి కామేశ్వర్ సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో రూ. 12, 58, 724 వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ లెక్కింపులో అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణ, ప్రకాశ్, దయానంద్, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్