సికింద్రాబాద్‌: తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం (వీడియో)

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జూలై 13 నుంచి 15 వరకు లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ఈ ఉత్సవం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జూలై 14న రంగం, అంబారి ఊరేగింపు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్