స్వచ్ఛ భారత్ మిషన్-2 కింద, టాయిలెట్లు లేని 2.19 లక్షల ఇళ్లలో వాటి నిర్మాణానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి ₹12,000 చొప్పున అందించనుంది. అలాగే, 7,000 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టనుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి స్వచ్ఛ భారత్ నిధులను అనుసంధానం చేశారు. అర్హులు స్వచ్ఛ భారత్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చు.