చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎక్స్ రోడ్ ఫుట్ పాత్ పై పడి ఉన్న సుమారు 50-60 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు వివరాలు లభించలేదు. దీంతో, మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.