యువత ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం సికింద్రబాద్ లోని రైల్ కళారంగ్ లో రోజ్ గార్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 15 విడతల్లో 10. 50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 51 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. యువతే భారతదేశ బలమని, వికాయిత్ భారత లక్ష్య సాధనలో వారి పాత్ర కీలకమన్నారు.