సైబర్ నేరాలపై వారాసిగూడ పోలీసుల ర్యాలీ

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారాసిగూడ పోలీస్ స్టేషన్ నుంచి మొరం గడ్డ చౌరస్తా వరకు శనివారం పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లు, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. మోసపోతే వెంటనే గోల్డెన్ అవర్‌లో '1930' నంబర్‌కు కాల్ చేస్తే డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్