ఇద్దరు కూతుళ్లతో సహా మహిళ అదృశ్యం: పోలీసుల గాలింపు

హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్, న్యూ బృందావన్ కాలనీలో నివాసముండే ప్రీతి కుమారి(23) తన ఇద్దరు కూతుళ్లు సబా(3), సూఫీ(2)లతో కలిసి గత నెల 26న కనిపించకుండా పోయింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు పైన పేర్కొన్న నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్